బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్

బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్

లండన్ : బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్లు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు, మన దేశ మూలాలున్న రిషి సునాక్  తెలిపారు. తన అభ్యర్థిత్వాన్ని ఆయన ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘యూకే గొప్ప దేశం. అయితే కొంత కాలంగా మనమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాం. మన పార్టీని ఏకతాటిపైకి తెచ్చి ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాలనుకుంటున్నా. అందువల్లే కన్జర్వేటివ్ పార్టీ లీడర్ గా నిలబడి ప్రధాని పదవికి పోటీచేస్తున్నా” అని రిషి ట్వీట్ చేశారు.

ఇంతకుముందు కేబినెట్ లో పనిచేసిన ట్రాక్ రికార్డును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి బయటపెట్టేందుకు తన అనుభవం ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘నేను నడిపే ప్రభుత్వంలో ప్రతి స్థాయిలో నిజాయతీ, జవాబుదారీతనం, ప్రొఫెషనలిజం ఉంటాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాత్రీపగలు కష్టపడతా. సమస్యల వలయం నుంచి బయటపడేందుకు నాకొక అవకాశం ఇవ్వాలని నేను మిమ్మల్ని(ఎంపీలను) కోరుతున్నా” అని రిషి ట్విటర్​లో పేర్కొన్నారు.