బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి  !

V6 Velugu Posted on Jan 15, 2022

బ్రిటన్‌ ప్రధాని రేసులో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్‌ ముందంజలో ఉన్నారు.  భారత సంతతికి చెందిన ఆయన ప్రస్తుతం బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కరోనాను అరికట్టేందుకు బ్రిటన్‌లో 2020 మేలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో తన నివాసంలో డ్రింక్‌ పార్టీ ఏర్పాటు చేశానంటూ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల అంగీకరించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనపై విమర్శలు వచ్చాయి. ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలతో పాటు సొంత కన్జర్వేటివ్‌ పార్టీ నేతలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.  ఆయన స్థానంలో రిషి సునాక్‌ సమర్థంగా పనిచేయగలరని మెజారిటీ ఎంపీలు భావిస్తున్నారు.

 

మరిన్ని వార్తల కోసం... 

పాక్ సరిహద్దులో 1400 కిలోల భారత జాతీయ జెండా

Tagged Rishi Sunak, Indian descent, British Prime Ministerial race!

Latest Videos

Subscribe Now

More News