పాక్ సరిహద్దులో 1400 కిలోల భారత జాతీయ జెండా

పాక్ సరిహద్దులో 1400 కిలోల భారత జాతీయ జెండా

ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను రాజస్థాన్‌లో ప్రదర్శించారు. ఆర్మీ డే సందర్భంగా భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన లాంగేవాలాలో 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు అయిన జెండాను బహిరంగ ప్రదర్శనకు ఉంచారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ ప్రకారం.. 1971లో భారతదేశం మరియు పాకిస్థాన్‌ల మధ్య చరిత్రకు కేంద్రబిందువైన లాంగేవాలాలో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. అక్టోబర్ 2, 2021న లేహ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి ఇది 5వ బహిరంగ ప్రదర్శన. అంతకుముందు అక్టోబర్ 8, 2021న వైమానిక దళ దినోత్సవం సందర్భంగా హిండన్ ఎయిర్‌బేస్‌లో ఒకసారి, అక్టోబర్ 21, 2021న ఎర్రకోటలో ఖాదీ జాతీయ జెండాను మరోసారి, డిసెంబర్ 4, 2021న నేవీ డే సందర్భంగా ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జాతీయ జెండాను ప్రదర్శించారు.

225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 1400 కిలోల బరువున్న ఈ జెండాను చారిత్రాత్మక సందర్భాలలో ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శించేందుకు ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) రక్షణ దళాలకు అప్పగించింది.

ఈ జెండాను సిద్ధం చేయడానికి 70 మంది ఖాదీ కళాకారులకు 49 రోజులు పట్టినట్లు కేవీఐసీ తెలిపింది. అదేవిధంగా ఈ జెండాను తయారు చేయడానికి కార్మికుల కోసం దాదాపు 3500 పని గంటల అదనంగా సృష్టించినట్లు కేవీఐసీ నివేదించింది. చేతితో నేసిన ఖాదీ పత్తిని ఉపయోగించి 4500 మీటర్ల జెండా తయారు చేయబడిందని.. ఈ జెండా మొత్తం 33, 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు కేవీఐసీ తెలిపింది. కాగా..  జెండాలోని అశోక చక్రం 30 అడుగుల వ్యాసంతో ఉంటుందని కేవీఐసీ చెప్పింది. భారత సైన్యం యొక్క మొదటి భారత కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కోదండర ఎం కరియప్పకు గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డేని జరుపుకుంటారు.

For More News..

పండగపూట గుర్రమెక్కిన బాలయ్య

కోడి పందెంలో ఓడిన కోడి ధర ఎంతో తెలుసా..

టీ-20 వరల్డ్ కప్‎పై ఐసీసీ కీలక ప్రకటన