అత్తకు అవార్డుపై.. ప్రధాన మంత్రి అల్లుడు రియాక్షన్

అత్తకు అవార్డుపై.. ప్రధాన మంత్రి అల్లుడు రియాక్షన్

ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి పద్మభూషణ్ అవార్డు అందుకోవటంపై వారి కుమార్తె.. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, తొలి మహిళ​అక్షతా మూర్తి స్పందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు అందుకోవటంపై వారు స్పందించారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ అత్తయ్య సుధా మూర్తి కావటం విశేషం. 

అత్త సుధామూర్తి పద్మభూషన్​ అవార్డు అందుకోవటంపై.. ఇది గర్వించదగిన రోజు అంటూ చప్పట్లు కొట్టే ఎమోజీని పోస్ట్ చేశారు ఆయన. సుధామూర్తి కుమార్తె అయిన బ్రిటన్ తొలి మహిళ అక్షతా మూర్తి స్పందిస్తూ.. కదిలే అనుభవం.. మా అమ్మ గుర్తింపు కోసం బతకలేదు. మా తమ్ముడు, నాలో వారు పెంపొందించిన విలువలకు ఇది గుర్తింపు. కృషి, వినయం, నిస్వార్థత ఆమెలో ఎప్పుడూ ఉంటాయి. ఆమె ఓ కదిలే అనుభవం.. నిన్న కనిపించిన దృశ్యం ఒక్క క్షణం గుర్తింపు మాత్రమే అంటూ తల్లిపై ప్రేమను వ్యక్తం చేశారామె. 

సుధా మూర్తి ఎన్నో స్వచ్చంధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 25 ఏళ్లుగా అందరికీ చదువు అనే లక్ష్యంతో.. అక్షరాస్యత పెంచేందుకు కృషి చేస్తున్నారు. వందల కోట్లు విరాళాలు ఇస్తూ.. పిల్లల విద్యకు పాటుపడుతున్నారు. అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలతో బాధితులుగా మారిన వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ఉచితంగా ఇల్లు కట్టించి ఇవ్వటం, ఉపాధి చూపించటం వంటివి చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా కూడా ఉన్నారు. చదువు ఆవశ్యకతను వివరిస్తూ.. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు సుధామూర్తి. సామాజిక సేవా కార్యక్రమాలను 25 ఏళ్లుగా కొనసాగిస్తున్నందుకు గుర్తింపుగానే పద్మభూషన్ అవార్డు వరించింది. 

సుధామూర్తికి స్వయానా అల్లుడు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్. సుధామూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పద్మభూషన్ అవార్డు అందుకున్న అత్తకు.. విషెస్ చెప్పారాయన.  సుధా మూర్తి డిసెంబర్ 2021 వరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు.