మెట్రోకు పెరుగుతున్న ప్రయాణీకులు

 మెట్రోకు పెరుగుతున్న  ప్రయాణీకులు

హైదరాబాద్ లో  ట్రాఫిక్ లేని కంఫర్టబుల్ జర్నీ అంటే మెట్రో రైలే అంటున్నారు జనం. దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్  హైదరాబాద్.  కోవిడ్ ప్యాండమిక్ తో నష్టపోయిన మెట్రో రైల్ కు జనం నుంచి రెస్పాన్స్ పెరుగుతోంది. అయితే మెట్రో ప్రయాణీకులకు...షాపింగ్ ఎక్స్ పీరియన్స్ కల్పించేందుకు మెట్రో స్టేషన్స్ లో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తోంది.  హైదరాబాద్ లో మెట్రో రైల్ కు ప్రయాణీకులు పెరుగుతున్నారు. కోవిడ్ తర్వాత మెట్రో స్టేషన్స్ లో కమర్షియల్ స్పేస్ పెంచేందుకు అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా వ్యాపారులతో ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నారు. మెట్రో బజార్ పేరుతో 15 రోజుల పాటు ఎగ్జిబిషన్  ఏర్పాటు చేశారు. షీ టీమ్ చీఫ్ ఐపీఎస్ ఆఫీసర్ స్వాతీ లక్రా ఈ ఎగ్జీబిషన్ లాంచ్ చేశారు. మహిళా ఆంట్రప్రెన్యూయర్స్ కు చేయూత ఇచ్చేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలను చేయడం సంతోషంగా ఉందన్నారు స్వాతి లక్రా. మెట్రోలో మహిళల సేఫ్టీ కోసం ప్రత్యేక  క్యూ ఆర్ కోడ్ ద్వారా చర్యలు చేపడుతున్నామన్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలోని 66 స్టేషన్లలో కొన్నింటిలో మాత్రమే కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ ఉంది. మిగతా స్టేషన్లలోనూ వ్యాపారాలు జరిగేందుకు అవకాశాలు కల్పిస్తామంటున్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఆసక్తి ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరతో వ్యాపారం చేసుకునేందుకు ఛాన్స్ ఇస్తామన్నారు.  మెట్రో స్టేషన్స్ లో ఖాళీ స్పేసుల్లో టెంపరరీ స్టాల్స్ ఏర్పాటుకు తక్కువ రెంట్ తో వ్యాపారులకు అవకాశం కల్పిస్తున్నారు. హాండ్లూమ్స్, ఫుట్ వేర్, హోం మేడ్ ఫుడ్, జూట్ బ్యాగ్స్, హ్యాండ్ మేడ్ గిఫ్టింగ్ సొల్యూషన్స్, సల్ఫేట్, లాంటి కెమికల్ ఫ్రీ ఉత్పత్తులపై అవగాహనతో పాటు, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను అందిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న బ్యూటీ, బాడీ ప్రాడక్ట్స్ కు ఆల్టర్నేట్ గా ఈ ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెంచేందుకు మెట్రో స్టేషనల్లో మహిళా వ్యాపారులు స్టాల్స్ పెడుతున్నారు. మెట్రోలో ప్రయాణికులతో పాటు.. కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ పెంచేందుకు మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. సిటీలో బయట ఎక్కువ రెంట్స్ పెట్టలేని వారు మెట్రో స్టేషన్స్ ని ఉపయోగించుకోవచ్చంటున్నారు.