నారాయణ్ పూర్, జూరాలకు మళ్లీ పెరిగిన వరద

నారాయణ్ పూర్, జూరాలకు మళ్లీ పెరిగిన వరద

కృష్ణమ్మకు మళ్లీ వరద పెరిగింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో… ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుకు వరద అంతకంతా వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండి ఉండటంతో… వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు అధికారులు. దీంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ప్రస్తుతం జూరాలకు…లక్షా 60 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో జూరాల 13 గేట్ల ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు లక్షా 63 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ 9 పాయింట్ 65 టీఎంసీలు కాగా… ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిలువ 9 పాయింట్ 23 టీఎంసీలుగా ఉంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు తుంగభద్ర కూడా ఉరకలేస్తుంది. జూరాల నుంచి వస్తున్న ఇన్ ఫ్లో రేపు ఉదయానికి…. శ్రీశైలంకు చేరుకునే అవకాశం ఉంది. అయితే భారీగా వరద వస్తుండటంతో… శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో పెంచారు అధికారులు. జలాశయం నుంచి పవర్ హౌజ్, కాల్వల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నారు.