సంపంగి, 6 టీన్స్ వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ.. దర్శకనిర్మాతగా రూపొందించిన చిత్రం ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ జంటగా నటించారు. జూన్ రెండో వారంలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మల్కాపురం శివ కుమార్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
హీరో సందీప్ మాట్లాడుతూ ‘ లవ్, ఎమోషన్, ఫైట్స్, యాక్షన్, మ్యూజిక్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో ఫ్రెండ్‌షిప్, కామెడీ, లవ్ ఉంటే.. సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఈ జర్నీ నాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది’ అని అన్నాడు. ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ ‘సంగీత దర్శకుడిగా పలు చిత్రాలతో ఆడియెన్స్‌కు దగ్గరయ్యాను.
దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. మంచి పాటలు కూడా అందించాను. ఈ సినిమా మ్యూజికల్‌గా ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది’ అని చెప్పారు. ఈ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచిందని అషు రెడ్డి, 30 ఇయర్స్ పృథ్వీ అన్నారు.
