ఆడియన్స్కు రతిక, ప్రశాంత్ బాగా నచ్చేశారట.. అందుకే టాప్లో పెట్టేశారు

ఆడియన్స్కు రతిక, ప్రశాంత్ బాగా నచ్చేశారట.. అందుకే టాప్లో పెట్టేశారు

బిగ్‌బాస్ సీజన్7(Bigg boss season7)లో సక్సెస్ ఫుల్ గా మొదటివారం పూర్తికానుంది. ఈ సీజన్ మొదటి ఎలిమినేషన్ కు కూడా ఒకరోజు మాత్రమే ఉంది. ఇక శనివారం ఎపిసోడ్ లో నాగార్జున(Nagarjuna) వచ్చి కంటెస్టెంట్స్ తో హంగామా చేశారు. కంటెస్టెంట్స్ కు ఎవరు ఏంటి? ఎం ఎం చేయాలి అనేది క్లియర్ గా చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సీజన్ కోసం కొత్తగా ఆడియన్స్ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలా ఆడుతున్నారు? ఎంత జెన్యూన్ గా ఉన్నారు? అనేది మర్క్స్ తో సహా బయటపెట్టేశారు. 

ఆ లిస్టులో అనూహ్యంగా రతిక అండ్ ప్రశాంత్ టాప్ లో నిలిచారు. అంతేకాదు హోస్ట్ నాగార్జున కూడా ఈ ఇద్దరి గురించి స్పెషల్ గా చెప్పుకొచ్చాడు. మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి చాలా దగ్గరగా ఉన్నారని, అలానే కంటిన్యూ చేయండి అని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చూసిన ఆడియన్స్ మాత్రం ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

నిజానికి ఈ జంటపై ప్రేక్షకులు ముందు నుండి కాస్త అసహనంగా ఉన్నారు. ఏదో కాలక్షేపానికి బిగ్ బాస్ చూద్దాం అంటే.. ఈ పులిహోర పనులేంట్రా, మాకీ ఖర్మ ఏంట్రా బాబు అనుకుంటూ తలలు బాదుకున్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో కూడా పెడుతున్నారు. అంతేకాదు కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అంటూ మీమ్స్ కకూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ ఇద్దరూ ఆడియన్స్ పోల్ లో టాప్ రావడం షాక్ కి గురి చేసింది. 

అయితే ఈ ఇద్దరికి వచ్చిన ఆ పాయింట్స్ వారి వారి వ్యక్తిగత ప్రవర్తన బట్టి వచ్చాయని, జంటగా చేస్తున్న పులిహోర పనులకు కాదని వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. పహిల్వాన్ టాస్క్ లో ప్రశాంత్, మెమరీ టాస్క్ లో రతిక అద్భుతంగా రాణించారని, అందుకే వారు ఆడియన్స్ కు నచ్చారని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.