V6 News

Riyan Parag: డ్రెస్సింగ్ రూమ్లో దమ్ముకొట్టడమా..! అడ్డంగా బుక్కైన రియాన్ పరాగ్.. శిక్ష తప్పదా..?

Riyan Parag: డ్రెస్సింగ్ రూమ్లో దమ్ముకొట్టడమా..! అడ్డంగా బుక్కైన రియాన్ పరాగ్.. శిక్ష తప్పదా..?

క్రికెట్ స్టేడియంలో ఉండే డ్రెస్సింగ్ రూమ్ అంటే ఎన్నో రూల్స్.. ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కనీసం మొబైల్ ఫోన్ కూడా అనుమతించరు. అలాంటి  చోట దమ్ము కొట్టడమంటే మామూలు విషయమా..? అది కూడా ఒక కెప్టెన్ అయ్యుండి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకుంటారా..? ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ వేపింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

2026 ఏప్రిల్ 28వ తేదీ.. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్ లో వేపింగ్ చేస్తూ కూర్చున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో పరాగ్ ఈ సిగరెట్ దమ్ము గుంజుతుండటం బ్రాడ్ కాస్ట్ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫూటేజ్ వెంటనే వైరల్ గా మారింది. 16 బాల్స్ లో 29 రన్స్ చేసి ఔటైన పరాగ్.. డ్రెస్సింగ్ రూమ్స్ కు చేరుకున్నాక వేపింగ్ చేస్తున్నట్లు కెమెరాకు చిక్కాడు. 

శిక్ష తప్పదా..?

స్టేడియాల్లోని డ్రెస్సింగ్ రూమ్స్, డగౌట్ లలో పొగాకు వినియోగం పై నిషేధం ఉంది. ప్లేయర్ల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి నిబంధనలున్నాయి. రూల్స్ అతిక్రమించిన పరాగ్ కు శిక్ష తప్పదని అంటున్నారు. జైలు శిక్ష లేదా భారీగా ఫైన్ పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 

రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లటంతో.. స్ట్రగుల్స్ లో ఉన్న పరాగ్.. ఈ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. బ్యాటింగ్ కన్సిస్టెన్సీ లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఐపీఎల్ లో 7 ఇన్నింగ్స్ లో కేవలం 81 రన్స్ మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 222 రన్స్ చేజ్ చేసి పంజాబ్ కింగ్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. 

రాజస్థాన్ ప్లేయర్లు, మేనేజ్మెంట్ కాంట్రవర్సీల్లో చిక్కుకోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే టీమ్  మేనేజర్ రోమీ భిండర్ పై లక్ష రూపాయల జరిమానా విధించారు. బెంగళూరుతో మ్యాచ్ లో మొబైల్ ఫోన్ వాడినందుకు ఫైన్ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు పరాగ్ వేపింగ్ చేస్తూ దొరికిపోవడంపై నెటిజన్స్ ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు. గేమ్ పైన కాన్సంట్రేట్ చేయమంటే.. ఇదేంది భయ్యా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.