
హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో జరుగుతున్న ఐదో టిస్కాన్ యూత్ ఓపెన్ రెగెట్టా పోటీల్లో మహ్మద్ రిజ్వాన్ సత్తా చాటాడు. మంగళవారం జరిగిన అప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ బాలుర విభాగంలో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. మరో రెండు రేసులు మిగిలి ఉండగానే టాప్ ప్లేస్‌ను సాధించాడు.
రెండో స్థానం కోసం బొంగూర్ బన్నీ, ఆకాశ్ కుమార్ మధ్య గట్టిపోటీ నెలకొంది. ఇదే కేటగిరీ బాలికల విభాగంలో తెలంగాణ సెయిలింగ్ అకాడమీకి చెందిన షేక్ రమీజ్ భాను, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన శ్రింగేరి రాయ్‌పై ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచి ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఐఎల్‌సిఎ 4 కేటగిరీ బాలుర విభాగంలో నేవీ యాచ్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన రమాకాంత్ ఆరు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇదే కేటగిరీలో బాలికల విభాగంలో ఆస్థా పాండే అగ్రస్థానంలో నిలిచింది.