
రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో RJ శేఖర్ బాషా శనివారం రాత్రి లావణ్యపై దాడి చేశాడు. రెండురోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ లో ఉండగా లావణ్య, శేఖర్ బాషా మధ్య వివాదం జరిగింది. కోపానికి గురైన లావణ్య శేఖర్ బాషాపై చెప్పుతో దాడి చేసింది. దీంతో శనివారం రాత్రి శేఖర్ బాషా లావణ్యపై దాడి చేసి, హత్యాయత్నం చేశాడని ఆమె ఆరోపిస్తు్న్నారు. గాయాలతో లావణ్య డయల్ 100 కి సమాచారం ఇచ్చి హాస్పిటల్ కు వెళ్లారు.
ఈ మేరకు లావణ్య జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. లావణ్య చేయి, వీపుపై కడుపులో తన్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. శేఖర్ బాష నుంచి తనకు ప్రాణ హాని ఉందని అన్నారు. ఉదయ్, ప్రీతీ ల డ్రగ్స్ వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. ఆమెపై రాజ్ తరుణ్ చాలా మందిని ప్రయోగిస్తున్నాడని లావణ్య ఫైర్ అయ్యారు. శేఖర్ బాషాను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరింది.