ద్రౌపదిముర్మును విగ్రహంతో పోల్చడంపై వివాదం

 ద్రౌపదిముర్మును విగ్రహంతో పోల్చడంపై వివాదం
  • కలకలం సృష్టించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై తేజస్వి కామెంట్స్

న్యూఢిల్లీ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి భవన్ ముందు విగ్రహం అవసరం లేదన్నారు తేజస్వీ యాదవ్. ద్రౌపది ముర్ము అనే విగ్రహాన్ని బీజేపీ కుర్చీలో కూర్చోబెడుతుందన్నారు. యశ్వంత్ సిన్హా మాట్లాడటం చూశాం.. ద్రౌపదిముర్ము ఎప్పుడైనా మాట్లాడారా ? అంటూ తేజస్వీ యాదవ్ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. తమకు రాష్ట్రపతి భవన్‌లో విగ్రహం అక్కర్లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ఎగతాళి చేయడంపై కలకలం చెలరేగింది.