మళ్లీ వైసీపీ వైపు ఆర్కే చూపు - ఇంతలోనే రియలైజ్ అయ్యాడా..?

మళ్లీ వైసీపీ వైపు ఆర్కే చూపు - ఇంతలోనే రియలైజ్ అయ్యాడా..?

2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకు రెట్టింపవుతోంది. 2019 ఎన్నికల్లో వచ్చిన అనూహ్య మెజారిటీని నిలబెట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. సిద్ధం సభలతో.. ఎన్నికల శంఖారావం పూరించింది. కార్యకర్తలు, నేతల్లో జోష్ నింపింది. ఇదే సమయంలో సీఎం జగన్ కి అసమ్మతి సెగ కూడా కాస్త గట్టిగానే తగులుతోంది. మొన్నటికి మొన్న.. జగన్ ఆత్మగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా వైసీపీ శిబిరానికి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

అయితే, వైసీపీని వీడి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్కే.. మళ్లీ వైసీపీలో చేరనున్నాడని వార్తలు ఊపందుకున్నాయి. ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి ఆ తర్వాత జగన్ తో మంతనాలు జరపనున్నాడని టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే వైసీపీలోకి ఆర్కే రీఎంట్రీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యిందనే చెప్పాలి.

Also Read : విశాఖలో నేవీ మిలాన్ -2024…సాగరతీరాన విన్యాసాలు

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కొద్దికాలానికే ఆర్కే ఆ పార్టీ గుడ్ బై చెప్పాలని భావించటం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ కొనసాగితే భవిష్యత్తుకి గ్యారెంటీ లేదని రియలైజ్ అయ్యాడా లేక వైసీపీ ఆ దిశగా పావులు కదిపిందా అన్న చర్చ మొదలైంది. మొత్తానికి ఇంట్రస్టింగ్ గా మారిన మంగళగిరి ఎపిసోడ్ ఎలా ముగుస్తుందో చూడాలి.