
ఆర్‌కె సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది హండ్రెడ్’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు కలిసి నిర్మించారు.
జులై 11న సినిమా విడుదల కానున్న సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ‘‘మొగలి రేకులు’ సీరియల్‌లో ఆర్కే నాయుడు అనే పోలీస్ పాత్రను ఆరేళ్లు పోషించా. దాన్నుంచి బయటకు వచ్చి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిద్దార్థ, షాదీ ముబారక్ చిత్రాల్లో నటించా. కానీ ప్రేక్షకులు మళ్లీ నానుంచి పోలీస్ క్యారెక్టర్ కోరుకుంటున్నారని ఇందులో నటించా. ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పిన రియల్ స్టోరీ ఇది.
దర్శకుడు సుకుమార్ గారికి చెబితే చాలా ఎక్సైట్ అయ్యి ముందుగా ఈ సినిమా చేయమన్నారు. కథకు యాప్ట్ అవడంతో పాటు సొసైటీకి ఏదైనా మంచి చేయాలి అనే తపనతో పెట్టిన టైటిల్ ఇది. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. కమర్షియల్ అంశాలతో పాటు అద్భుతమైన సందేశం ఉన్న సినిమా. ఇందులోని నా క్యారెక్టర్ చూశాక ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది.
మిషా, ధన్య, విష్ణు ప్రియ.. ఈ మూడు క్యారెక్టర్లు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. ఇక నాకు ఇష్టమైన సినిమా ‘నాయకుడు’. అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది’ అని చెప్పాడు.