మెస్ ఛార్జీలు రూ.50లు ఏం సరిపోతాయి: ఆర్ కృష్ణయ్య

మెస్ ఛార్జీలు రూ.50లు ఏం సరిపోతాయి: ఆర్ కృష్ణయ్య

బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులతో కలిసి మాసబ్ ట్యాంక్ లోని తెలుగు సంక్షేమ భవన్ ను ముట్టడించారు. అనంతరం రోడ్ పై బైఠాయించి వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. అధికారంలోకి రాక ముందు విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడమే కాకుండా హాస్టల్స్ లలో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ :- Indian Wells 2024: తప్పుకున్న నాదల్.. భారత టెన్నిస్ స్టార్‌కు మరో అవకాశం

సీఎం రేవంత్ రెడ్డి హాస్టల్ విద్యార్థులతో కలిసి హాస్టల్ భోజనం చేస్తే వారి అవస్తలు తెలుస్తుందని  ఆర్.కృషయ్య అన్నారు. గత ఆరేళ్లుగా మెస్ చార్జీలు పెంచడం లేదని.. ఒక్క విద్యార్థికి రోజు వారీ మెస్ చార్జీలు రూ.50 లు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.