గురుకుల పాఠశాలలో ఆర్​వో ప్లాంట్ ధ్వంసం

గురుకుల పాఠశాలలో ఆర్​వో ప్లాంట్ ధ్వంసం

ఏడుగురు టెన్త్​ స్టూడెంట్స్​ను బయటికి పంపిన ప్రిన్సిపాల్​

కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో నాయకన్​గూడెం గ్రామంలోని మహాత్మా జ్యోతి రావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఆర్​వో ప్లాంట్, సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. దీనికి ఏడుగురు టెన్త్ ​క్లాస్​ స్టూడెంట్స్​ కారణమని గుర్తించి వారిని ఇంటికి పంపించారు. స్కూల్​ ఇన్​చార్జ్​ ప్రిన్సిపాల్​ మున్వర్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి స్కూల్​లోని ఆర్​వో ప్లాంట్, సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి.

దీనిపై విచారణ చేపట్టి పదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు దీనికి కారణంగా తేల్చారు. వారు సిమెంట్​ మూతలతో ఆర్​వో ప్లాంట్, సీసీ కెమెరాలను కొట్టి ధ్వంసం చేసినట్లు గుర్తించారు. స్టూడెంట్స్​ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. ఎస్​ఎస్సీ ఎగ్జామ్​ రాస్తున్నవారికి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సోమవారం హాల్​ టిక్కెట్లు ఇచ్చి వారి స్వగృహాలకు పంపించారు.