ములుగు, వెలుగు: గ్రామస్తులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు సర్పంచ్ తీగుళ్ల కనకయ్య తెలిపారు. గ్రామంలో సూపరీస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జుబేర్ పాషా, సూపరీస్ సిస్టమ్స్ ప్రతినిధులు నెకర్ బసవరాజ్, సుదీప్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

