
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద స్కూల్ బస్సు బోల్తాపడింది. అతివేగంతో అదుపు తప్పిన స్కూల్ బస్సు ఢీవైడర్ ను ఢీ కొట్టింది. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు మధ్యలో బస్సు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వచ్చి వెంటనే క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి తొలగించారు.