తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం...అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొన్న కారు..

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం...అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొన్న కారు..

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొనడంతో ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయ్యింది. శనివారం ( జులై 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 39వ మలుపు దగ్గర కారు అదుపుతప్పి రైలింగ్ ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయ్యింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తెలంగాణకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఘాట్ రోడ్డులో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.