వామ్మో.. KBR పార్క్‌లో 20 అడుగుల కొండచిలువ.. దేన్నో మింగింది కూడా..!

వామ్మో.. KBR పార్క్‌లో 20 అడుగుల కొండచిలువ.. దేన్నో మింగింది కూడా..!

హైదరాబాద్: హైదరాబాద్ KBR పార్క్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో వాకర్స్ ఆసక్తిగా తిలకించారు. (KBR) నేషనల్ పార్క్‌లో ఉదయం సుమారు 20 అడుగుల పొడవైన భారీ కొండచిలువ కనిపించింది. కొండచిలువ వాకర్స్ వే దాటుతుండగా వీడియో తీశారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. కొండ చిలువ దేనినో మింగిందని పొట్ట చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. పొట్ట లోపల ఏదో ఉందని.. అందుకే నెమ్మదిగా కదులుతుందని లావుగా ఉన్న కొండ చిలువ శరీరం చూస్తే అర్థమైంది.

అయితే.. KBR పార్కులో పాములు కనిపించడం కొత్తేమీ కాదు గానీ అంత పెద్ద కొండ చిలువ కనిపించేసరికి వాకర్స్ గుండె ఝల్లుమంది. అంత దగ్గరగా చూసేసరికి వెన్నులో వణుకు పుట్టింది. KBR పార్కులో కొన్ని వందల సంఖ్యలో పాములు ఉంటాయి. కొన్ని అరుదైన పాములు కూడా కనిపిస్తుంటాయి. పాములు తిరిగే ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలని బోర్డులు కూడా మనకు పార్కులో కనిపిస్తాయి.