అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

న్యూయార్క్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మృతులను 23 ఏండ్ల సౌరవ్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌, 20 ఏండ్ల మానవ్‌‌‌‌ పటేల్‌‌‌‌గా గుర్తించారు. శనివారం ఉదయం పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్లు క్లీవ్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ స్టేట్‌‌‌‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. మే10న పెన్సిల్వేనియాలోని లాంకస్టరన్‌‌‌‌ కౌంటీలో వీరి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో సౌరవ్‌‌‌‌, మానవ్‌‌‌‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై న్యూయార్క్‌‌‌‌లోని భారత కాన్సులేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది.