గచ్చిబౌలిలో రోడ్ యాక్సిడెంట్.. గౌలిదొడ్డి నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్పై వెళ్తుంటే..

గచ్చిబౌలిలో రోడ్ యాక్సిడెంట్.. గౌలిదొడ్డి నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్పై వెళ్తుంటే..

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని స్టే హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన సూరజ్ సింగ్(23) సోమవారం తెల్లవారుజామున గౌలిదొడ్డి నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్పై వెళ్తున్నాడు. అదుపు తప్పి డివైడర్ను బైక్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో సూరజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. 

గాయాల పాలైన యువకుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సూరజ్ చనిపోయాడు. ఈ ఘటనపై రణధీర్ సింగ్ సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి ఘటనే మరొకటి టోలిచౌకిలో జరిగింది. ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడి నిండు ప్రాణం పోయింది. టోలిచౌకిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్గా పనిచేసే యువకుడు మృతి చెందాడు. జెప్టో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న యువకుడు కస్టమర్కు డెలివరీ చేసేందుకు వెళ్తూ.. బైక్ స్కిడ్ అయి కింద పడిపోయాడు.

గమనించకుండా.. అభిషేక్ తల మీదకు ప్రైవేట్ బస్ డ్రైవర్ బస్ ఎక్కించాడు. స్పాట్లోనే అభిషేక్ చనిపోయాడు. ఆపకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన ప్రైవేట్ బస్ డ్రైవర్ను స్థానికులు అడ్డగించి బస్ ఆపారు. రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా.. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు పట్టించుకోకుండా వెళ్లిపోవడం శోచనీయం.