
జనగామ జిల్లా దేవరుప్పుల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, డీసీఎం వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మృతులు మహబూబాబాద్ కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు…ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.