ఖమ్మంలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చెరువుకట్ట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. నేలకొండపల్లికి చెందిన పాలపాటి వెంకటేశ్వర్లు, అతని తల్లి పిచ్చమ్మ, ఇద్దరు కుమారులు బైక్ పై ముదిగొండ మండంలో ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చి వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా యాక్సిడెంట్ చేసిన వాహనాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.