
ఒంగోలు: ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. ఈ సంఘటన శుక్రవారం ప్రకాశం జిల్లాలో జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర ఆగివున్న లారీని వెనుక నుంచి కారు స్పీడ్ గా ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ట్రీట్ మెంట్ కోసం హస్పిటల్ కి తరలించారు.మృతుల్లో ఒక బాలుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులంతా ఒకే ఫ్యామిలీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతులు కరీంనగర్ లోని మంకమ్మతోటకు చెందినవారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.