జింబాబ్వేలో రోడ్డు ప్రమాదం.. 27 మంది దుర్మరణం

జింబాబ్వేలో రోడ్డు ప్రమాదం.. 27 మంది దుర్మరణం

హరారే: జింబాబ్వే దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. హరారేలోని చివు ఏరియాలో ఓ మినీబస్, భారీ ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం ఓ చర్చి సభ్యులు మతపరమైన సమావేశానికి హాజరయ్యేందుకు మినీబస్‌‌‌‌‌‌‌‌లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముందువెళ్తున్న వాహనాన్ని ఓవర్‌‌‌‌‌‌‌‌టేక్ చేయడానికి ప్రయత్నించిన ట్రక్కు.. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మినీబస్‌‌‌‌‌‌‌‌ను ఢీకొన్నట్లు వివరించారు. 

ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 23 మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రమాద తీవ్రతకు మినీబస్ పూర్తిగా కాలిపోయిందని పేర్కొన్నారు. జింబాబ్వేలో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.