
ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరుసగా 9 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. దాదాపు రెండు కిలోమీటలర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై చెన్నమ్మ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక కారు డ్రైవర్ మితిమీరిన వేగం తో దూసుకొని వచ్చి సడన్ గా బ్రేక్ వేయటంతో.. వెనక ఉన్న కార్లు కంట్రోల్ తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి.
దీంతో కార్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. కార్లలో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. సమాచారం అందుకున్న ఓఆర్ఆర్ సిబ్బంది తో పాటు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.