రోడ్డు డిజైనింగ్​లో మార్పు తేవాలి : మాల్కం ఉల్ఫ్

రోడ్డు డిజైనింగ్​లో మార్పు తేవాలి : మాల్కం ఉల్ఫ్

ఖైరతాబాద్, వెలుగు: దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా రోజుకు 500 మంది చనిపోతున్నారని రోడ్ ​క్రాప్ట్​ సొసైటీ అధ్యక్షుడు మాల్కం ఉల్ఫ్, కార్యదర్శి ఆదిశంకర్ ​పేర్కొన్నారు.  వాహనాలు నడిపే వారికి సరైన అవగాహన లేకనే  ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

రోడ్డు భద్రతావారోత్సవాల్లో భాగంగా సోమవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మోటారు​వాహనాల చట్టం వందేండ్ల కిందట చేసిందని, దానిలో మార్పులు తీసుకురావాలన్నారు.  ముఖ్యంగా వాహనం నడిపే వారిని ఎడ్యుకేట్ ​చేయాలన్నారు.  ఫుట్ పాత్ ల ఆక్రమణలతో ప్రజలు రోడ్డుపై నడిచి ప్రమాదాలకు గురువుతున్నారన్నారు. వాహనాలకు అనుగుణంగా రోడ్డు డిజైన్​లో మార్పు తీసుకురావాలని మాల్కం ఉల్ఫ్​ ప్రభుత్వానికి సూచించారు.