
అధికారులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పీఆర్ (పీరియాడికల్ రెన్యూవల్), ఎఫ్‌డీఆర్ (ఫ్లడ్ డ్యామేజ్ రోడ్స్) కోసం సీఎం కేసీఆర్ రూ.2,500 కోట్లు మంజూరు చేశారని అర్అండ్‌బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15లోపు వర్క్ టెండర్స్ పూర్తిచేసి పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల పునరుద్ధరణ పనులు అనుకున్న టైమ్‌లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సోమవారం ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ నుంచి అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో మంత్రి వేముల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత రెండు సీజన్లలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ రివ్యూలో సెక్రటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సీ రవీందర్ రావు పాల్గొన్నారు.