
రోడ్డు వేసేటప్పుడు ఏదైనా అడ్డుంటే ఏం చేస్తరు.. దానిని పక్కకు తీసేసి రోడ్డేసుకుంట పోతరు. వరంగల్ అర్బన్ జిల్లా కాశీబుగ్గలో ఆర్ అండ్ బీ అధికారులు, రోడ్డేసిన కాంట్రాక్టర్ మాకెందుకులే అనుకున్నరేమో. అడ్డంగా బోరింగ్ కనిపిస్తున్నా.. అట్లనే రోడ్డేసేసిన్రు. బోరు సగం వరకు డాంబర్తో నింపేసిన్రు. రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్న కనీస ఆలోచన లేకుండా రోడ్డు పోసిన్రు. ఇప్పటికైనా బాట పొంటి అడ్డంగున్న ఆ బోర్ను తీసేయాలని జనం కోరుతున్నరు. - కాశిబుగ్గ, వెలుగు