
వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులను మళ్లీ శుక్రవారం అధికారులు మొదలుపెట్టారు. మొత్తం 322 నిర్మాణాల్లో 253 తొలివిడతలో కూల్చివేయగా 90 మందికి చెందిన 110 నిర్మాణాలను కోర్టు స్టే కారణంగా కూల్చలేదు. స్టే గడువు ముగియడంతో ఆ నిర్మాణాలను అధికారులు జేసీబీల సాయంతో తొలగించారు.
ఇంకా నలుగురికి చెందిన ఐదు నిర్మాణాలపై స్టే ఉందని ఆర్డీవో రాధాబాయి, కమిషనర్ అన్వేష్ తెలిపారు. కాగా రోడ్డు విస్తరణ పనులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు.