చెట్టు అడ్డొచ్చిందని.. 3 నెలలుగా  పనులు బంద్... సూరారం చౌరస్తాలో చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్

చెట్టు అడ్డొచ్చిందని.. 3 నెలలుగా  పనులు బంద్... సూరారం చౌరస్తాలో చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్
  • సమస్య పరిష్కారం కోసం యువకుడి వినతి

జీడిమెట్ల, వెలుగు: అదో నేషనల్ హైవే.. అయినప్పటికీ సూరారం చౌరస్తా వద్ద నిత్యం గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణీకులు నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్న వర్షం పడినా రోడ్డు చెరువుగా మారుతుండడంతో డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి. అయితే మధ్యలో ఓ చెట్టు అడ్డురావడంతో కాంట్రాక్టర్ మూడు నెలలుగా పనులు ఆపేశాడు. చెట్టు తొలగించకపోతే పనులు ముందుకు సాగని పరిస్థితి. 

అసంపూర్తి పనుల వల్ల రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రయాణీకులు గాయాలపాలవుతున్నారు. ఈ క్రమంలో అధికారులు, కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో సూరారానికి చెందిన యువకుడు కోల శ్రీకాంత్ సమస్యను గుర్తించి పరిష్కారం దిశగా అడుగులు వేశాడు. మంగళవారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మన్​ను కలిసి వినతిపత్రం అందజేశాడు. మున్సిపల్, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేసి వేలాది ప్రయాణీకుల కష్టాలు తీర్చాలని కోరారు.