
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలో రోడ్లు బాగు చేయాలంటు సోమవారం బురదలో దిగి విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు భాద్యులు మాట్లాడుతూ రామగుండం కార్పోరేషన్ లో ఎన్నో నిధులు ఉన్న రోడ్లు బాగు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. సప్తగిరి కాలనీలో రెండు గురుకుల పాఠశాలలు ఒక ప్రైవేట్ కళాశాల ఒక ప్రైవేట్ పాఠశాల ఉన్నాయని మూడు వేల మందికి విద్యార్థులకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. నిత్యం ఎంతో మంది ఈ రోడ్డు వైపు వస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఇప్పటికైనా స్థానిక అధికారులు గుర్తించి, రోడ్డు వేయాలని కోరారు.
దూర ప్రాంతాల నుండి గురుకుల పాఠశాలలో చదువుకుందామని వస్తున్న విద్యార్థులు.. తల్లిదండ్రులు ఈ రోడ్డును చూసి వెనుదిరిగి వెళ్తున్నారని అన్నారు. ఎలక్షన్స్ కోడ్ పేరుతో కాలయాపన చేయకుండా రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.