చెన్నై: బంగారం ఎత్తుకెళ్లేందుకు దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. అందికాడికి దోచుకుని అడ్డువస్తే దాడి చేసి చంపేందుకు వెనకాడటం లేదు. బంగారం కోసం చైన్ స్నాచింగ్ లు, ఇళ్లలో చొరబడి తీవ్రంగా గాయపర్చడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది.
అర్థరాత్రి ఇంట్లో చొరబడి బంగారం కోసం ఏకంగా చెవులనే కోసుకెళ్లారు దుండగులు. ఈ ఘటన శుక్రవారం( అక్టోబర్ 18) తెల్లవారు జామున తమిళనాడులోని శివగంగ జిల్లాలో జరిగింది. బాధితులు ఒడువన్ వట్టికి చెంది చిన్నయ్య , అతని భార్య సరస్వతి ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు చొరబడ్డారు. చిన్నయ్యపై కిరాతంగా దాడి చేశారు..అనంతరం సరస్వతి చెవులకు ఉన్న రింగులను దోచుకునేందుకు ఏకంగా ఆమె చెవులనే కోశారు.
Also Read : మన దేశపు అందగత్తె నిఖిత
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సరస్వతిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చిన్నయ్య,సరస్వతిపై ఈ ఏడాది (2024) జనవరిలో కూడా ఇదే తరహాలో దాడి జరిగింది. ఆ సమయంలో కూడా బంగారంఎత్తుకెళ్లారు దొంగలు.. కేవలం పదినెలల వ్యవధిలో రెండుసార్లు దాడి జరగడం, బంగారం ఎత్తుకెళ్లడంతో స్థానికుల్లో భయాందోళనకు దారితీసింది.