దారి దోపిడీ ముఠా అరెస్ట్.. వారిలో ఒక స్టూడెంట్

దారి దోపిడీ ముఠా అరెస్ట్.. వారిలో ఒక స్టూడెంట్

హైదరాబాద్ పోలీసులు డేకాయిట్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు.  బైక్‎పై వెళ్తున్న వారిని ఆపి చోరీకి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పీవీఆర్ ప్లైఓవర్ పిల్లర్ నంబర్ 71 దగ్గర ద్విచక్రవాహనదారులను ఆపి.. వారి నుంచి రెండు తులాల గోల్డ్ చైన్, ఒక మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన ముఠాను అరెస్ట్ చేసినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మహమ్మద్ ఖాజా, అస్లాం, ఆసీఫ్, హాబీబ్, ఖాసిమ్‎లను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వీరంతా హైదరాబాద్‎కు చెందినవారేనని.. వీరిలో ఒక స్టూడెంట్ కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ గ్యాంగ్ నుంచి చోరీ చేసిన వస్తువులతో పాటు మూడు బైకులను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.

చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఈ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతుందని జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. రోడ్డుపై వెళ్తున్న వారిని ఫాలో చేసి.. గొడవపడి డబ్బులు లాక్కుంటారని ఆయన చెప్పారు. పీవీఆర్ ప్లైఓవర్ కింద జరిగిన దోపిడీలో డయల్ 100కు ఫిర్యాదు వచ్చిన 7 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి వెళ్ళామని ఆయన అన్నారు. ఈ గ్యాంగ్ తాగిన మైకంలో దాడులకు పాల్పడుతుందని ఆయన అన్నారు. ఈ గ్యాంగ్ ఇంకా గంజా వరకు వెళ్ళలేదని ఆయన చెప్పారు. 

For More News..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రికి ఫైనేసిన జీహెచ్ఎంసీ

వృద్ధులకు ఫ్రీ మీల్స్.. మిగతావారికి రూ. 5లకే ఫుల్ మీల్స్

కేసీఆర్‎కు బండి సంజయ్ డెడ్‎లైన్

సూసైడ్ అటెంప్ట్ చేసిన మిస్ తెలంగాణ