ప్రేమికులపై దాడి.. గొలుసు చోరీ

ప్రేమికులపై దాడి.. గొలుసు చోరీ

గండిపేట, వెలుగు: నార్సింగిలో రాబరీ గ్యాంగ్‌ రెచ్చిపోయారు. కోకాపేట్‌ నియో పోలీస్‌ వద్ద ప్రేమికులు మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్​లపై అక్కడికి వచ్చారు. ప్రేమికులపై దాడి చేసి వారి మెడలో ఉన్న బంగారు గొలుసు, మొబైల్‌ ఫోన్‌తో పాటు నగదు తీసుకొని పారిపోయారు.ఒంటరిగా ఉన్నప్రేమికులను టార్గెట్‌గా చేసుకొని ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. బాధితులు నార్సింగి పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దుండగులను పట్టుకుంటామని తెలిపారు.