చందానగర్‌లో చోరీ: కోటి విలువైన సిగరెట్ బాక్సులు మాయం

V6 Velugu Posted on Jan 03, 2020

హైదరాబాద్: చందానగర్ లో చోరీ జరిగింది. హైదరాబాద్ అమీన్ పూర్ రహదారిలోని కృష్ణవేణి స్కూల్ పైన ఉన్న ITC ఆశీర్వాద్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. ఇందులో నుంచి కోటి విలువైన సిగెరెట్ బాక్సులతో పాటు ఇతర ఉత్పత్తులను దొంగలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు తెలివిగా కార్యాలయంలోని సీీసీటీవి కెమెరాల కేబుల్ కనెక్షన్ ను కట్ చేశారు. ఆతరువాత ఒక ఆటోలో సిగరెట్ బాక్సులను తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగిలించ పడ్డ సరుకు విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

Tagged Hyderabad, Telangana, theft, chanda nagar, Cigarette

Latest Videos

Subscribe Now

More News