
రాబర్ట్ డౌనీ జూనియర్స్.. పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమేమోగానీ, ఐరన్ మ్యాన్ అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారేమో కదా. అవెంజర్స్ హీరో అన్నా మదిలో మెదుల్తది కదా. ఈ హీరో గారు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమా కోసం తీసుకున్న పైసలు రూ.524 కోట్లని (7.5 కోట్ల డాలర్లు) తెలుసా? అంతేకాదు.. ఆ సిరీస్‌లలో బ్యాక్ ఎండ్ ద్వారానూ లాభాల్లో వాటా వచ్చిందట. స్పైడర్ మాన్: హోం కమింగ్ సినిమా కోసమూ అంతే భారీ మొత్తంలో పైకం తీసుకున్నాడట. మూడు రోజుల షెడ్యూల్ కోసం రోజుకు సుమారు రూ.34.75 కోట్లు (50 లక్షల డాలర్లు) తీసుకున్నాడట. ఐరన్ మ్యాన్ సక్సెస్ తర్వాత 2 కోట్ల డాలర్లు (సుమారు రూ.140 కోట్లు) వసూలు చేసిన హీరోల జాబితాలోనూ డౌనీ చేరిపోయాడు. కాగా, అతడు నటించిన అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఐదు రోజుల్లో రూ.8 వేల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.