IPL ఆక్షన్: రాజస్థాన్ కు రాబిన్ ఊతప్ప

IPL ఆక్షన్: రాజస్థాన్ కు రాబిన్ ఊతప్ప

కోల్ కతా : ఐపీఎల్ – 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. వేలంలో 338 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. భారత సీనియర్లపై ఫ్రాంఛైజీలు ఇంట్రెస్ట్ చూపడంలేదు. స్టూవర్ట్ బిన్నీ, యూసుఫ్ పఠాన్ అన్ సోల్డ్ గా ఉన్నారు. చివర్లో రాబిన్ ఊతప్పను సొంతం చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. ఊతప్పను రూ.3కోట్లతో వేలంలో దక్కించుకుంది RR.

ఇప్పటివరకు జరిగిన వేలం వివరాలు

పాట్‌కమ్మిన్స్(ఆస్ట్రేలియా)ను కోల్‌కతా జట్టు రూ.15.50 కోట్లకు దక్కించుకుంది.
మ్యాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)ను రూ10.75 కోట్లకు పంజాబ్
క్రిస్ మెరిస్‌ను(దక్షిణాఫ్రికా) రూ.10 కోట్లకు బెంగళూరు
ఇయాన్ మోర్గాన్‌ను( ఇంగ్లాండ్) రూ.5.25 కోట్లకు కోల్‌కతా
ఆరోన్ ఫించ్‌ను(ఆస్ట్రేలియా) రూ.4.40 కోట్లకు బెంగళూరు
రాబిన్ ఊతప్ప(భారత్) రూ.3 కోట్లకు రాజస్థాన్
క్రిస్‌లిన్‌ను(ఆస్ట్రేలియా) రూ.2 కోట్లకు ముంబై
జాసన్‌రాయ్‌ను(ఇంగ్లాండ్) రూ.1.50 కోట్లకు ఢిల్లీ జట్లు దక్కించుకున్నాయి.