KINGDOM: ‘ఎప్పటికీ నేను మీ బక్కోడినే’.. తెలుగులో అనిరుధ్‌ అదిరిపోయే స్పీచ్.. వీడియో వైరల్

KINGDOM: ‘ఎప్పటికీ నేను మీ బక్కోడినే’.. తెలుగులో అనిరుధ్‌ అదిరిపోయే స్పీచ్.. వీడియో వైరల్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. సోమవారం రాత్రి (జులై28న) యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ఈవెంట్తో కింగ్‌డమ్ మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ తమదైన స్పీచ్ లతో అదరగొట్టారు. ఇందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మాట్లాడిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనిరుధ్ మాట్లాడుతూ.. ‘‘గత 12 ఏళ్లుగా తెలుగు ప్రజలు తనను తమ వాడిని చేసుకున్నారని, నన్ను మీ కొడుకులా చూసుకున్నారని చెప్పారు. తాను ఎప్పటికీ మీ అనిరుధ్నేనని.. మీ బక్కోడినేనని’’అనిరుధ్ తెలుగులో మాట్లాడి అదరగొట్టేశారు. దాంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ల ముఖాల్లో నవ్వులు విరబూశాయి. 

అలాగే హీరో సత్యదేవ్ కింగ్‌డమ్ మూవీలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో దేవరకొండ సోదరుడు శివ అనే పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు.

ఈ సందర్భంగా సత్యదేవ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘‘ కింగ్‌డమ్లో భాగమైనందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. విజయ్ను నేను చాలా దగ్గర నుంచి చూశాను. చాలా అరుదైన వ్యక్తి. మంచి మనిషి, ఇతరుల గురించి కేర్ తీసుకుంటాడు.

విజయ్ ఈ సినిమాతో ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సామాన్యుడిలా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘కింగ్‌డమ్’ను స్థాపించుకున్న విజయ్ అంటే నాకు అపార గౌరవం. విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవరకొండ కాదు బంగారుకొండ ’’ అంటూ సత్యదేవ్  తనదైన ప్రేమను పంచుకున్నారు. 

ఇకపోతే.. కింగ్‌డమ్ మరో రెండ్రోజుల్లో (జులై31) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ తో విజయ్ సతమతం అవుతున్నాడు. కనుకే ఈ మూవీ విజయం దేవరకొండకు ఎంతో అవసరం.

ఈ క్రమంలో కింగ్‌డమ్ టీజర్, ట్రైలర్ ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి. మరి కింగ్‌డమ్ ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి. ఇప్పటికే కింగ్ డమ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఫస్ట్ డే బుకింగ్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్లను రాబట్టడం ఖాయం.