ముంబై : ఐపీఎల్19లో భాగంగా సోమవారం లక్నో సూపర్ గెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఉత్కంఠగా జరిగిన పోరులో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. నికోలస్పూరన్ (21 బంతుల్లో 1 ఫోర్, 8 సిక్స్‌లతో 63), మిచెల్‌మార్ష్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) ధాటిగా ఆడారు.
ముంబై బౌలర్లలో కోర్బిన్ బాష్ 2/20 పర్వాలేదనిపించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై (18.4) ఓవరల్లో టార్గెట్‌ను ఛేదించింది. ర్యాన్రికెల్టన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83), రోహిత్‌శర్మ (44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) హాఫ్‌సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్నందించారు. 'ప్లేయర్‌ఆఫ్‌ద మ్యాచ్' ర్యాన్రికెల్టన్ కు దక్కింది.
ధాటిగా ఆడిన నికోలస్..
టాస్ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో ఓపెనర్లు జోస్ఇంగ్లిస్, మిచెల్ మార్ష్ శుభారంభాన్నిచ్చారు. జోష్‌మీద కనిపించిన ఇంగ్లిస్(13) ఘజన్ఫర్బౌలింగ్లో భారీ షాట్‌కు యత్నించి సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్.. మార్ష్‌తో జతకట్టాడు. ఇద్దరు కలిసి 34 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 5వ ఓవర్లో విల్‌జాక్స్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఖాతా తెరిచిన పూరన్ ఆ తర్వాత నాలుగు, ఐదు బంతులను సిక్స్‌లుగా మలిచి ఈ ఓవర్లో 20 పరుగులు రాబట్టాడు.
6వ ఓవర్ ఘజర్ఫర్ బౌలింగ్‌లో రెండు, మూడో బంతిని ఫోర్, సిక్స్ కొట్టాడు. కేవలం పూరన్16 బంతుల్లో హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. 8 వ ఓవర్లో పూరన్(21 బంతుల్లో 1 ఫోర్, 8 సిక్స్‌లతో 63) కార్బిన్ బాష్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ ర్యాన్రికెల్టన్కు క్యాచ్ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో నమన్ధీర్కు క్యాచ్ఇచ్చి మిచెల్ మార్ష్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44) అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పంత్(15) విల్‌జాక్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌చేరాడు. ఆ తర్వాత రఘు వంశీ (11) త్వరగానే అవుటైనా ఐడెన్ మార్క్రామ్ (25 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 31, హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) ధాటిగా ఆడడంతో లక్నో 20 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది.
చెలరేగిన హిట్‌మ్యాన్, రికెల్టన్..
లక్ష్య ఛేదన ప్రారంభించిన ముంబై ఓపెనర్లు రోహిత్‌శర్మ, రికెల్టన్ విధ్వంసం సృష్టించారు. తొలి బంతినే ఫోర్‌కొట్టి రికెల్టన్ ఖాతా తెరిచాడు. 6 ఓవర్లో ఆవేశ్‌ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ వరుసగా రెండు ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 21 పరుగులు రాబట్టాడు. కానీ ఇదే ఓవర్లో ఆఖరు బంతిని గాల్లోకి లేపిన రోహిత్.. బౌండరీ లైన్‌వద్ద ప్రిన్స్యాదవ్అందుకునే ప్రయత్నం చేశాడు.
కానీ బంతి నేలను తాకి అతడి చేతుల్లోకి వెళ్లింది. త్రుటిలో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై వికెట్‌నష్టపోకుండా 71 పరుగులు చేసింది. రికెల్టన్22 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం 9వ ఓవర్లో రోహిత్27 బంతుల్లో హాఫ్‌సెంచరీ కంప్లీట్ చేశాడు.
11 వ ఓవర్లో మోహ్సిన్ఖాన్బౌలింగ్లో రికెల్టన్(32 బంతుల్లో 83) ఇంగ్లిస్‌కు క్యాచ్ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం 13 ఓవర్లో మణిమారన్ బౌలింగ్‌లో రోహిత్ (44 బంతుల్లో 84) మహ్మద్షమీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తిలక్‌వర్మ, సూర్యకుమార్ యాదవ్ త్వరగానే అవుట్ అయినప్పటికీ నమన్ధీర్(23, విల్‌జాక్స్(10) 18.4 ఓవర్లలో జట్టును విజయతీరాలకు చేర్చారు.
సంక్షిప్త స్కోరు:
లక్నో : 20 ఓవర్లలో 228/5 (నికోలస్ పూరన్63, మిచెల్ మార్ష్44, కోర్బిన్ బాష్ 2/20)
ముంబై: 18. 4 ఓవరల్లో 229/4 ( ర్యాన్ రికెల్టన్ 83, రోహిత్‌శర్మ 84, మణిమారన్2/47
