
టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ళ రోహిత్ 12 ఏళ్ళ క్రికెట్ కు గుడ్ బై చెబుతూ బుధవారం (మే 7) తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు కెప్టెన్సీ నుంచి రోహిత్ పేరు తొలగించినట్టు నివేదికలు చెబుతున్నాయి. హిట్ మ్యాన్ కెప్టెన్ కెప్టెన్సీ నుంచి తప్పించడం దాదాపు ఖాయంగా మారింది.
వయసు పెరగడం.. ఫిట్ నెస్ సమస్యలు.. ఫామ్ లేకపోవడం వంటి కారణాలతో రోహిత్ శర్మ తన సారధ్య బాధ్యతలను కోల్పోయినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ కారణంగానే టెస్టుల నుంచి రోహిత్ టెస్ట్ ల నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ కావడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-3 తేడాతో కోల్పోవడం హిట్ మ్యాన్ టెస్ట్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. దీనికి తోడు బ్యాటింగ్ లో పేలవ ఫామ్ అతనిపై తీవ్ర విమర్శలు తీసుకొని వచ్చింది.
►ALSO READ | ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. పాకిస్తాన్ సూపర్ లీగ్కు ఫారిన్ ప్లేయర్ల షాక్..?
చివరి 10 టెస్టుల్లో రోహిత్ యావరేజ్ దారుణంగా ఉంది. రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో గిల్ లేదా రాహుల్ ఇంగ్లాండ్ సిరీస్ లో జట్టు పగ్గాలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు రోహిత్‌శర్మ టెస్ట్ క్రికెట్ లో 67 టెస్టుల్లో 4,301 పరుగులు చేశాడు. వీటిలో 12 సెంచరీలు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇకపై కేవలం వన్డే క్రికెట్ మాత్రమే ఆడనున్నాడు.
🚨 NEWS ALERT! 🚨
— CricTracker (@Cricketracker) May 7, 2025
Rohit Sharma has announced his retirement from Test cricket with immediate effect! pic.twitter.com/An9JEmKSzO