ఆసీస్ గడ్డపై కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన రోహిత్: తొలి విదేశీ ప్లేయర్‎గా హిట్ మ్యాన్ రేర్ ఫీట్

ఆసీస్ గడ్డపై కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన రోహిత్: తొలి విదేశీ ప్లేయర్‎గా హిట్ మ్యాన్ రేర్ ఫీట్

మెల్‎బోర్న్: సిడ్ని వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 125 బంతుల్లో 121 పరుగులు చేసి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా హిట్ మ్యాన్ రికార్డ్ నెలకొల్పాడు. 

మూడో వన్డేకు ముందు కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ఆస్ట్రేలియాలో చెరో ఐదు శతకాలు బాది సంయుక్తంగా ఫస్ట్ ప్లేస్‎లో ఉన్నారు. సిడ్ని వన్డేలో సెంచరీ చేయడం ద్వారా కోహ్లీని వెనక్కి నెట్టి రోహిత్ ఈ జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. దీంతో పాటు హిట్ మ్యాన్ మరో రికార్డ్ కూడా నెలకొల్పాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియా తరుఫున అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు (15787 ) చేసిన తొలి బ్యాటర్‎గా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (15758) పేరిట ఉండేది. సిడ్ని వన్డేలో సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ తర్వాతే ఉండటం గమనార్హం.