
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో T20లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 23 బంతులలో అర్థ శతకం పూర్తిచేసుకున్నాడు. T20లలో గత పది ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన రోహిత్ ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతున్నాడు. బెన్నెట్ బౌలింగ్‌లో రోహిత్ వరుసగా 6,6,4,4,6 పరుగులతో రెచ్చిపోయాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో T20 మ్యాచ్‌లో అతిథ్య జట్టుతో తలపడుతోంది. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కొల్పోయి భారత్ 89 పరుగులు చేసింది.