రోహిత్​ స్వీట్‌‌16..ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో 16 ఏండ్లు పూర్తి ​

రోహిత్​ స్వీట్‌‌16..ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో 16 ఏండ్లు పూర్తి ​

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో 16 ఏండ్లు పూర్తి చేస్తున్నారు. డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో దంచికొట్టి 20 ఏండ్ల వయసులో ఇండియా  తలుపు తట్టిన హిట్‌‌మ్యాన్‌‌ తక్కువ టైమ్‌‌లోనే  సూపర్ స్టార్లలో ఒకడిగా మారాడు. 2007లో జూన్‌‌ 23వ తేదీన  రాహుల్‌‌ ద్రవిడ్‌‌ కెప్టెన్సీలో ఐర్లాండ్‌‌పై తొలి వన్డే ఆడిన అతను అదే ఏడాది ధోనీ కెప్టెన్సీలో  వరల్డ్‌‌ కప్‌‌లో ఇంగ్లండ్‌‌పై మొదటి టీ20లో బరిలోకి దిగాడు. ఈ రెండు మ్యాచ్‌‌ల్లోనూ రోహిత్‌‌కు బ్యాటింగ్‌‌ చేసే చాన్స్‌‌ రాలేదు. 

అయితే,  తన రెండో టీ20లోనే  సౌతాఫ్రికా (డర్బన్‌‌), నాలుగో వన్డేలోనే పాకిస్తాన్‌‌ (జైపూర్‌‌) జట్లపై  ఫిఫ్టీలు కొట్టి టాలెంట్‌‌ చూపెట్టాడు. టెస్టులు ఆడేందుకు ఆరేండ్లు వెయిట్‌‌ చేసిన హిట్‌‌మ్యాన్‌‌ 2013లో ఈడెన్‌‌ గార్డెన్స్‌‌లో వెస్టిండీస్‌‌పై డెబ్యూ చేశాడు. తన తొలి టెస్టులోనే భారీ సెంచరీ (177) కొట్టి ఆకట్టుకున్నాడు. ఈ 16 ఏండ్లలో టాలెంటెడ్‌‌ యంగ్‌‌స్టర్‌‌ నుంచి సూపర్‌‌ హిట్టింగ్‌‌తో రోహిత్​ అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌‌గా ఎదిగాడు.