రోహిత్‌‌‌‌‌‌‌‌ @ 9..టాప్లో కేన్

రోహిత్‌‌‌‌‌‌‌‌ @ 9..టాప్లో కేన్

దుబాయ్‌‌‌‌‌‌‌‌: వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో రాణించిన ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌ను కూడా మెరుగుపర్చుకున్నారు. బుధవారం విడుదలైన టెస్టు బ్యాటర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌ సంయుక్తంగా 9వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, జైస్వాల్‌‌‌‌‌‌‌‌ పదకొండు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి 63వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ 12వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ 14వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నారు. కేన్‌‌‌‌‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. 

బౌలర్లలో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకున్నాడు. రవీంద్ర జడేజా ఒక్క ర్యాంక్‌‌‌‌‌‌‌‌ మెరుగుపడి ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. పేసర్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌ ఆరు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి 33వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్నాడు.