క్రికెట్లో 500 సిక్సులు కొట్టిన ఏకైక భారత ప్లేయర్

క్రికెట్లో 500 సిక్సులు కొట్టిన ఏకైక భారత ప్లేయర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్లో 500 సిక్సులు బాదిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. వరల్డ్ వైడ్గా 427 మ్యాచుల్లో 500 సిక్సులు కొట్టిన రెండో ప్లేయర్గా నిలిచాడు. ఈ జాబితాలో విండీస్ విధ్వంకర వీరుడు క్రిస్ గేల్ ఉన్నాడు. అతను 483 మ్యాచుల్లో 553 సిక్సులు కొట్టాడు. 


ధోనిది ఆరో ప్లేస్..

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో  పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ 476 సిక్సులతో మూడో స్థానంలో ఉన్నాడు. అతను 524 మ్యాచుల్లో 476 సిక్సులు బాదాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మెకల్లమ్ 432 మ్యాచుల్లో 398 సిక్సులు..గప్తిల్ 367 మ్యాచుల్లో 383 సిక్సులు కొట్టాడు. ఈ  జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఆరో ప్లేస్లో ఉన్నాడు. ధోని 538 మ్యాచుల్లో 359 సిక్సులు కొట్టడం విశేషం.  అయితే ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న గేల్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో...రోహిత్ శర్మ గేల్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. 


రోహిత్ ఆడినా..ఓటమి..

బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఆ తర్వాత 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్...207 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ..వేలిగాయాన్ని భరిస్తూ..బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. ఇందులో 3 బౌండరీలు, 5 సిక్సర్లున్నాయి. కానీ చివరి ఓవర్లో భారత్ విజయానికి 20 పరుగులు కావాల్సి ఉండగా..14 పరుగులే రావడంతో..భారత్ 5 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. 

https://twitter.com/thebharatarmy/status/1600497530076381187