
దుబాయ్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ (756) ఒక్క ప్లేస్ మెరుగుపడి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. హిట్‌మ్యాన్ వన్డే కెరీర్‌పై సందిగ్ధం కొనసాగుతున్నా.. ర్యాంక్ మెరుగుపడటం అతనికి కాన్ఫిడెన్స్ పెంచే అంశం. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్న రోహిత్.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ప్రాక్టీస్ షురూ చేశాడు. 2019 వరల్డ్ కప్ టైమ్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ పాయింట్లు (882) సాధించిన రోహిత్.. చివరిసారి చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.
టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (784) టాప్ ర్యాంక్‌లో ఉండగా, విరాట్ కోహ్లీ (736) నాలుగో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇటీవలే విరాట్ కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (751) మూడో ర్యాంక్‌కు పడిపోగా, డారిల్ మిచెల్ (న్యూజిలాండ్, 720) ఐదో ర్యాంక్‌లో ఉన్నాడు. ఇండియా తరఫున శ్రేయస్ అయ్యర్ (704), కేఎల్ రాహుల్ (638) వరసగా 8, 15వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (650) రెండో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు.