టీ20 ర్యాంకింగ్.. రోహిత్‌‌@ 8

టీ20 ర్యాంకింగ్.. రోహిత్‌‌@ 8

దుబాయ్‌‌: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌లో నిరాశపరిచిన టీమిండియా వైస్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌శర్మ ర్యాంకింగ్స్‌‌లో మాత్రం ప్రమోషన్‌‌ కొట్టేశాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టీ20 బ్యాట్స్‌‌మెన్‌‌ ర్యాంకింగ్స్‌‌లో రోహిత్‌‌ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఎనిమిదో ర్యాంక్‌‌ సాధించాడు. మొత్తం 664 పాయింట్లతో తనతో సమంగా నిలిచిన ఇంగ్లండ్‌‌ ప్లేయర్‌‌ అలెక్స్‌‌ హేల్స్‌‌తో కలిసి ఈ స్థానాన్ని పంచుకున్నాడు. రోహిత్‌‌ తర్వాత కేఎల్‌‌ రాహుల్‌‌ పదో ర్యాంక్‌‌లో నిలిచాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో అజేయ హాఫ్‌‌ సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీతో పాటు మరో ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ ఒక్కో ర్యాంక్‌‌ మెరుగుపర్చుకొని టాప్‌‌ టెన్‌‌కు చేరువయ్యారు. కోహ్లీ 11వ ప్లేస్‌‌కు చేరగా, ధవన్‌‌ 13వ ర్యాంక్‌‌కు చేరాడు.  బౌలర్లలో వాషింగ్టన్‌‌ సుందర్‌‌ ఎనిమిది స్థానాలు మెరుగై 50 ర్యాంక్‌‌కు చేరగా, కుల్దీప్‌‌ 14వ ర్యాంక్‌‌లో నిలిచాడు.