మెహ్‌దీ హసన్, మహ్మదుల్లా పాట్నర్ షిప్ కొంపముంచింది: రోహిత్ శర్మ

మెహ్‌దీ హసన్, మహ్మదుల్లా పాట్నర్ షిప్ కొంపముంచింది: రోహిత్ శర్మ

రెండో వన్డేలో ఓటమికి బౌలింగ్ వైఫల్యమే కారణమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మెహ్‌దీ హసన్, మహ్మదుల్లా పాట్నర్ షిప్ కొంపముంచిందని చెప్పాడు. వీరిద్దరిని ఔట్ చేయకపోవడమే టీమిండియా ఓటమికి కారణమని వెల్లడించాడు. బంగ్లాదేశ్ 69/6‌తో ఉన్న సమయంలో  270 పరుగులు చేయడం గొప్ప విషయమన్నాడు. అయితే అది టీమిండియా బౌలింగ్ వైఫల్యం వల్లనే సాధ్యమైందన్నాడు. మొదట్లో రాణించిన బౌలర్లు మిడిల్, డెత్ ఓవర్లలో విఫలమయ్యారని తెలిపారు. గత మ్యాచ్‌లోనూ  ఇదే తప్పిదం చేశారని..మరోసారి రిపీట్ అయిందన్నాడు. దీనిపై వర్క్ చేయాల్సి ఉందన్నాడు. 

ఫ్రాక్చర్ లేదు..

బొటన వేలి గాయం తీవ్రంగానే ఉందని రోహిత్ శర్మ వెల్లడించాడు. డిస్ లొకేట్ అవ్వడంతో కుట్లు వేశారని చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు ఫ్రాక్చర్ లేకపోవడంతో బ్యాటింగ్ చేయగలిగానని చెప్పాడు.  ఓటమి ఎదురైనప్పుడు ప్రతికూలాంశాలతో పాటు సానుకూలాంశాలు కూడా ఉంటాయని చెప్పుకొచ్చాడు. 


వంద శాతం ఆడాల్సిందే..

టీమిండియాను గాయాల బెడద వేధిస్తోందని రోహిత్ చెప్పాడు. గాయాలపై సీరియస్‌గా దృష్టిపెట్టాలన్నాడు. టీమిండియా తరఫున ఆడుతున్నప్పుడు 100 శాతం ప్రదర్శన ఇవ్వాలన్నాడు. అయితే ఆటగాళ్ల వర్క్ లోడ్‌‌ను పర్యవేక్షించాలని చెప్పాడు. చివరి వన్డేలో ఎవరు ఆడతారు..ఎవరి ఆడరనే విషయం ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు.